Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ మొత్తానికి 'రంగస్థలం' శాటిలైట్ హక్కులు!

  • సుకుమార్ సిద్ధం చేసిన 'రంగస్థలం'
  • చరణ్ - సమంతల క్రేజీ కాంబినేషన్ 
  • ఒక రేంజ్ లో జరిగిన బిజినెస్
మెగా అభిమానులంతా 'రంగస్థలం' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వాళ్లలో ఆసక్తి పెరిగిపోతూ వుంది. ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక శాటిలైట్ హక్కులు కూడా ఒక రేంజ్ లో అమ్ముడయ్యాయి.

 ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులు .. డిజిటల్ హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయట. ఇక హిందీ శాటిలైట్ హక్కులు 10.50 కోట్లకు అమ్ముడైనట్టు చెబుతున్నారు. ఆడియో హక్కులు 1.5 కోట్లకు పోయాయని అంటున్నారు. దర్శకుడిగా సుకుమార్ కి గల ఇమేజ్ .. చరణ్ - సమంతలకి గల క్రేజ్ .. దేవిశ్రీ పాటలకి వచ్చిన రెస్పాన్స్ .. ఈ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విడుదల తరువాత వసూళ్ల విషయంలోను ఈ సినిమా సునామీని సృష్టించడం ఖాయమనేది అభిమానుల మాట.       
charan
samanta

More Telugu News